రేవంత్..కబ్జాదారుడు:హరీష్

1
- Advertisement -

రేవంత్ రెడ్డి కబ్జాదారుడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ అసైన్డ్ భూములను లాక్కుంటూ, ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ రెడ్డి అసలైన కబ్జాదారుడు అని మండిపడ్డారు.

22-Aను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కబ్జాదారులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలు కబ్జాదారులా?, ప్రజలు కాదు.. రాత్రికి రాత్రి భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది అన్నారు.కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కట్టుకున్న ఇళ్ళల్లో 40,50 ఏళ్ల నుండి జీవిస్తున్న ఈ ప్రజలు కబ్జాదారులా? చెప్పాలన్నారు.

2008లో రాజశేఖర్ రెడ్డి ULC భూములను రద్దు చేశాడు…కానీ రేవంత్ రెడ్డి ఇవాళ మీ భూములు 2008 కంటే ముందు ULC(అర్బన్ ల్యాండ్ సీలింగ్)లో ఉన్నాయని నిషేధిత జాబితాలో పెట్టాడు అన్నారు. ఇది సుప్రీంకోర్టు నియమనిబంధనలను ఉల్లంఘించినట్లే.. రేవంత్ రెడ్డి బాధితులను పట్టుకొని కబ్జాదారులు అంటున్నాడు అన్నారు హరీష్ రావు.

Also Read:తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు

- Advertisement -