బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరొకసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తనను నిరంతరం విమర్శించే మరియు ట్రోల్ చేసే వారిపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా రనౌత్, సోషల్ మీడియాలో తనను అనుచితంగా దూషించేవారు మరియు విమర్శించేవారు జీవితంలో ఏమీ సాధించలేని “చేతకానివారు, తిండికి లేనివారు” (భూకే నంగే లోగ్) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో సోను సూద్, తాప్సీ పన్ను వంటి సినీ ప్రముఖులతో పాటు బాబా రామ్‌దేవ్ వంటి వారిపై కూడా వివిధ సందర్భాల్లో తాను చేసిన వ్యాఖ్యలు మరియు తలెత్తిన వివాదాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
తానెప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తానని, అందుకే కొందరు జీర్ణించుకోలేక తనపై ద్వేషాన్ని చిమ్ముతుంటారని ఆమె పేర్కొన్నారు. ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేని వారే సోషల్ మీడియాలో ఇలాంటి హేయమైన కామెంట్లు చేస్తుంటారని కంగనా వ్యాఖ్యానించారు.
Also Read:అమెజాన్,స్విగ్గీకి షాక్!

