రక్షా బంధన్ అనగానే అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఉండే పేగుబంధం, అనురాగాలు గుర్తుకొస్తాయి. ఏదైనా భారతీయ పండుగ వేడుక పరిపూర్ణం కావాలంటే తీపి, కారాలతో కూడిన ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే. సాధారణంగా షాపుల్లో కొనే స్వీట్ బాక్సులకే పరిమితం కాకుండా ఈ రాఖీ పండుగ రోజున ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే సాంప్రదాయ వంటకాలను ఓసారి పరిశీలిద్దాం.
కొబ్బరి లడ్డూ..తక్కువ సమయంలో త్వరితగతిన తయారుచేసుకోగలిగే స్వీట్ ఇది. తురిమిన కొబ్బరి, పాలు/మిల్క్ మేడ్తో చేసే ఈ లడ్డూలలో యాలకల పొడి లేదా పొడి పండ్ల ముక్కలు చేర్చడం ద్వారా మరింత రుచిని తిసిరావచ్చు.
కేసర్ పేడా..సాఫ్రాన్ (కుంకుమపువ్వు) సువాసనతో, మెత్తగా ఉండే కేసర్ పేడా రాఖీ పండుగకు అత్యంత ప్రాచుర్యం పొందిన స్వీట్. పూజా కార్యక్రమం తర్వాత తోబుట్టువులకు తినిపించడానికి లేదా గిఫ్ట్ బాక్స్‌లో ప్యాక్ చేసి ఇవ్వడానికి ఇది సరైన ఎంపిక.
దాల్ కచోరీ..స్వీట్లతో పాటు హాట్ కాంబినేషన్ కోసం దాల్ కచోరీలు అనువుగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల రుచికరమైన పప్పు మిశ్రమంతో ఉండే వీటిని పుల్లటి చింతపండు చట్నీ మరియు ఘాటైన పుదీనా చట్నీతో వడ్డిస్తే కుటుంబ సభ్యులందరూ ఇష్టంగా తింటారు.
Also Read:ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’
గులాబ్ జామున్ ..పండుగ విందు గులాబ్ జామున్ లేకుండా పూర్తి కాదు. వేడివేడిగా, జీరాలో ఊరిన మెత్తటి గులాబ్ జామున్లు పండుగ భోజనం ముగింపులో తీపి అనుభూతిని అందిస్తాయి.రైస్ ఖీర్ ..పాలు, బియ్యం, యాలకులు, పంచదారలతో నెమ్మదిగా ఉడికించే ‘రైస్ ఖీర్’ ప్రతి పండుగకు ప్రత్యేక ఆకర్షణ. పైనుంచి జీడిపప్పు, బాదం, కుంకుమపువ్వు రేకులతో అలంకరిస్తే విందు మరింత ఘనంగా మారుతుంది.

