ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ కౌంటర్

3
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఆర్థిక తీవ్ర ఒత్తిడి మరియు మునుపెన్నడూ లేని ఆంక్షలను ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే పర్షియన్ గల్ఫ్ మరియు హోర్ముజ్ జలసంధి నుండి ఒక్క చుక్క చమురును కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయనివ్వమని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికా తమపై ఆర్థిక ఆంక్షలతో విరుచుకుపడితే, పర్షియన్ గల్ఫ్‌లోని ఏ మార్గం ద్వారా కూడా చమురు ఎగుమతులు జరగకుండా అడ్డుకుంటామని కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక యుద్ధానికి మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా తమపై దాడి చేసిన శత్రుదేశంగానే పరిగణిస్తామని హెచ్చరించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఇరాన్‌కు సహాయపడే ఆర్థిక మార్గాలు, వ్యాపార సంస్థలు మరియు చమురు అక్రమ రవాణాను పూర్తిగా నిలిపివేయడానికి “ఎకనామిక్ డి-డే” ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ హయాంలో ఇరాన్ ఆర్ధిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్‌లో ఐదవ వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధి మూతపడితే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

మధ్యప్రాచ్యంలో ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు మరియు ప్రపంచ చమురు మార్కెట్లపై దాని ప్రభావాన్ని ఈ వీడియో విశ్లేషిస్తుంది.

- Advertisement -