‘విశ్వంభర’..పవర్‌ఫుల్ లుక్

0
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ స్టూడియోలు వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (OST)ను విడుదల చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మెటాలిక్ త్రిశూలం మరింత పవర్‌ను తీసుకొచ్చింది. ఈ లుక్ సినిమాలోని దైవత్వం, వీరత్వంతో కూడిన ప్రపంచాన్ని ప్రజెంట్ చేస్తోంది.

మరోవైపు సెన్సేషనల్ కంపోజర్ గౌర హరి అందించిన OST పోస్టర్‌కు మరింత ఇంటెన్సిటీని జోడించింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలకు సంగీతం అందించిన గౌర హరి.. పవర్‌ఫుల్ పెర్కషన్, చాంట్స్, డ్రమాటిక్ బ్రాస్ అరేంజ్‌మెంట్స్‌తో ఈ OSTను రూపొందించారు.

మిస్టీరియస్ వాతావరణంతో ప్రారంభమయ్యే OST.. ఆ తర్వాత హై ఎనర్జీ మ్యూజికల్ ఎక్స్‌ప్లోషన్‌గా మారుతుంది. డివోషనల్ ఎలిమెంట్స్, హీరోయిక్ ఎనర్జీ కలిసిన విధానం చిరంజీవి పాత్ర చుట్టూ ఒక పవర్‌ఫుల్ ఆరాను క్రియేట్ చేస్తోంది.

దర్శకుడు వశిష్ఠ ‘విశ్వంభర’ను భారీ విజువల్ స్కేల్, రిచ్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన విజువల్ ఎక్స్‌ట్రావగాంజాగా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మౌనీ రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పాటలకు సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఓ డ్యాన్స్ నంబర్‌కు సంగీతం సమకూర్చారు. గౌర హరి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘విశ్వంభర’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Also Read:Gen Z..బీజేపీ స్పెషల్ ఫోకస్!

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్, మౌనీ రాయ్ (స్పెషల్ సాంగ్)

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ఠ
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యూవీ క్రియేషన్స్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి, భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: గౌర హరి
ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -