అమెరికా, కెనడా దేశాల మధ్య చివరి నిమిషంలో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో కెనడా నుంచి దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయని వాషింగ్టన్ వెల్లడించింది.
రెండు దేశాల మధ్య కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, చివరి క్షణంలో అమెరికా ప్రతిపాదించిన షరతులు ఏకపక్షంగా, అన్యాయంగా ఉన్నాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శించారు. దీంతో ఆయన వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేసి, తమ చర్చల బృందాన్ని ఒట్టావాకు తిరిగి రావాలని ఆదేశించారు.
అమెరికా నిర్ణయానికి నిరసనగా… తమ కార్మికులు, వ్యాపారాలను కాపాడుకోవడానికి కెనడా కూడా “డాలర్‌కు డాలర్” స్థాయిలో అంతే మొత్తంలో సమానమైన టారిఫ్‌లతో తిప్పికొడుతుందని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. అమెరికా విధించిన ఈ 50% సుంకాల ప్రభావం కెనడాలోని పలు ప్రముఖ రంగాలు మరియు ఉత్పత్తులపై పడనుంది.
మద్యం ఉత్పత్తులు: బీర్, వైన్ మరియు ఇతర స్పిరిట్స్.
డైరీ ఉత్పత్తులు: పాల ఉత్పత్తులు.
క్రీడా పరికరాలు: హాకీ స్టిక్స్, ఇతర హాకీ సామాగ్రి.
నిర్మాణ సామాగ్రి: సిమెంట్, ప్లైవుడ్ మరియు చెక్క ఉత్పత్తులు.
Also Read:ట్రంప్‌తో వాణిజ్య చర్చలు రద్దు!
పరిశ్రమలు, వైద్య పరికరాలు: ఎలక్ట్రికల్ పరికరాలు మరియు ఇతర పరిశ్రమ ఉత్పత్తులు.
ఉక్కు , అల్యూమినియం, ఆటోమొబైల్ మరియు కలప రంగాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అమెరికా సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కెనడా కోరింది. అయితే ఇందుకు అమెరికా నిరాకరించడంతో ఒప్పందం కుదరలేదు.

