వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణుఆయుధాన్ని పొందడానికి వీల్లేదని, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను అమెరికా భూభాగంగా అభివర్ణించారు.
సౌత్ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ… ఇరాన్ అణుఆయుధాన్ని సమకూర్చుకోకుండా అడ్డుకోవాల్సిందేనని, ఇప్పటికే దానిని నిరోధించేందుకు అమెరికా చర్యలు తీసుకుందని హెచ్చరించారు. మేము వారిని అణుఆయుధం సాధించనివ్వము; ఇరాన్ వద్ద అణుఆయుధం ఉండటానికి వీల్లేదు, లేకపోతే మీరు తీవ్రమైన పరిణామాలను చూస్తారు” అని ట్రంప్ అన్నారు. “మేము రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నాం వారు ఎప్పటికీ అణుఆయుధాన్ని పొందలేరు అన్నారు.
అమెರಿಕాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారు. అయితే వాషింగ్టన్ దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉందో లేదో అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఆ కీలకమైన జలసంధిపై అమెరికాకే నియంత్రణ ఉందన్నారు.వారు ఒక ఒప్పందం చేసుకోవాలని ఎంతగానో తపించిపోతున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని కోరుకుంటున్నామో లేదో కూడా మాకే తెలియదు. ఎందుకంటే నేను ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను అమెరికా భూభాగంగానే భావిస్తున్నాను, అది అమెరికా భూభాగమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందన్నారు.ఇరాన్‌పై విధించిన ఆర్థిక ముట్టడి కారణంగా ఆ జలసంధితో ముడిపడి ఉన్న ప్రాంతమంతటిపై తమకు పట్టు ఉందని పేర్కొన్నారు.మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఆ దిగ్బంధనాన్ని చూస్తే, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌కు సంబంధించిన మొత్తం ప్రాంతంపై మాకు సంపూర్ణ నియంత్రణ ఉందని అర్థమవుతుంది అన్నారు.
Also Read:పెరుగు జిగురుగా ఎందుకు మారుతుంది?
ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నప్పటికీ, సరైన నిబంధనలకు అంగీకరించడానికి సిద్ధంగా లేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. కాబట్టి వారు ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ నా అభిప్రాయంలో వారు సరైన ఒప్పందానికి ఇంకా సిద్ధంగా లేరు అని చెప్పారు.ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చుట్టూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ వ్యూహాత్మక జలమార్గం ఇరు దేశాల ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ ఓడల రాకపోకలకు ఏమాత్రం విఘాతం కలిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రాంతీయ భద్రత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

