ఢిల్లీ పీఎస్ ముందు రాహుల్ ధర్నా

2
- Advertisement -

జూలై 20న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పెల్లెట్ గన్ గాయాలపాలైన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వెలుపల భారీ ధర్నా చేపట్టారు. బాధితుడు సాహిల్ లోచాబ్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 20న జరిపిన ‘చలో సంసద్’ ప్రదర్శనలో ఢిల్లీ పోలీసులు తనపై పెల్లెట్ గన్‌తో దాడి చేయడంతో కంటికి, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు (FIR) నమోదు చేయాలని కోరుతూ ఆగస్టు 14 నుండి ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ, అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి లేదా దర్యాప్తు అధికారి (I/O) నంబర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, సాహిల్‌తో కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డిసిపి (DCP) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా కేసు నమోదు చేయకపోవడంతో రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ వెలుపల బైఠాయించి ధర్నాకు దిగారు.

ఈ ధర్నా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నో ఎఫ్‌ఐఆర్.. నో జస్టిస్.. సో వి సిట్” అంటూ కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు ఉపయోగించడం తీవ్ర నేరం. బాధితుడికి న్యాయం జరిగే వరకు, బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే వరకు మేము ఇక్కడి నుండి కదిలేది లేదు” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Also Read:అనీష్..‘ఇట్లు అర్జున’

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై ఇటువంటి కఠిన చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

- Advertisement -