మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా పార్టీలోనే కొన్ని గుంట నక్కలు కొండా సురేఖ వెనకాల ఉన్నాయి… అమ్మా సురేఖ.. రేవంత్ రెడ్డి రక్తం తాగింది చాలు పార్టీ నుండి వెళ్ళిపొండి అని చురకలు అంటించారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.
కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్లిపోతే మంచిది… మాలాంటి వాళ్లని అవమానపరుస్తూ మా రక్తం తాగుతామంటే మేము చూస్తూ సహించం అన్నారు. ఏ పార్టీలో అయినా సక్రమంగా గొడవలు లేకుండా ఉన్నావా కొండా సురేఖ? … ఒక్క ఎమ్మెల్యేతో అయినా మంచి సంబంధాలు ఉన్నాయా ? ..
నీ బిడ్డ మాట్లాడుతుంటే వెనుక బ్యానర్లో నీ ఫోటో ఉంటది, నీకు నీ బిడ్డ వ్యాఖ్యలకు సంబంధం లేదు అనడం ఏంటి? ..ఇంకెన్ని రోజులు నీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ నడిపిస్తావు చెప్పాలన్నారు నాయిని రాజేందర్ రెడ్డి.
కొండా సురేఖది నీచ సంస్కృతి ఉన్న కుటుంబం… పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు ఆమె మాటలు కాదు, అవి కొండా సురేఖ మాటలే అన్నారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు.పార్టీ సభ్యులు కానీ, అనామకులైన కొండా సుష్మిత మా ఎమ్మెల్యేను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుంది …ఇంతకంటే బజారు కల్చర్ ఎక్కడా ఉండదు అన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం.
Also Read:అనీష్..‘ఇట్లు అర్జున’
రాజగోపాల్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడు.. మునుగోడు ఉప ఎన్నికల్లో నీ గతి ఏమైందో తెలుసు కదా అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. చిన్నారెడ్డికి ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు.. ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు… రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, సురేఖ మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తే ఈ స్థాయికి వచ్చారు అన్నారు.

