సోమాలియా తీరంలో భారతీయులు బందీలు

2
- Advertisement -

సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ తీరంలో ఈ వారం ప్రారంభంలో పైరేట్లు అపహరించిన కేమరూన్ పతాకంతో ఉన్న సరుకు రవాణా నౌకలో ఆరుగురు భారతీయులు సహా 10 మంది సిబ్బంది ఉన్నారని సోమాలి అధికారి ఒకరు తెలిపారు. పోలార్ మూవ్‌మెంట్ షిప్పింగ్‌కు చెందిన M/V LUTUF అనే నౌకను సోమవారం పుంట్‌ల్యాండ్‌లోని ఈల్ జిల్లా, మర్రాయాకు దాదాపు 3.5 నాటికల్ మైళ్ళ దూరంలో పైరేట్లు స్వాధీనం చేసుకుని, నుగాల్ తీరం వైపు తీసుకెళ్లారు. ఈ నౌకలో మోగదిషులోని టర్కీ సైనిక శిక్షణ కేంద్రానికి తీసుకెళ్తున్న టర్కీ ఆయుధాలు, సమాచార మార్పిడి మరియు శాటిలైట్ పరికరాలు ఉన్నాయి.

నౌకలో ఉన్న సిబ్బందిలో ఆరుగురు భారతీయులు…ఒక టర్కీ పౌరుడు, ఒక జార్జియా పౌరుడు మరియు ఇద్దరు సెర్బియన్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారని సదరు అధికారి తెలిపారు.గతంలో ఏప్రిల్ 26న M/V Sward నౌకను అపహరించిన ముఠాతో సంబంధం ఉన్న ఎనిమిది మంది పైరేట్లు, ఈ నౌకను పుంట్‌ల్యాండ్‌లోని డాంగోరోయో జిల్లాలోని గర్మాల్ తీరానికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఆ తర్వాత టర్కీకి చెందిన రెండు నౌకలు ఆ అపహరించిన నౌక వద్దకు చేరుకోగా, టర్కీ హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించాయి.

మంగళవారం, ఇద్దరు వ్యక్తులతో ఉన్న ఒక చిన్న పడవ నౌక దగ్గరకు వచ్చి, సోమాలియాలో సాధారణంగా నమిలే ఉత్తేజక పదార్ధం ‘ఖట్’ (khat) ను అందించింది. ఆ పడవ తీరానికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన వైమానిక దాడిలో నలుగురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు? మరణించిన వారికి అపహరణతో సంబంధం ఉందా లేదా అనే విషయాలు వెంటనే స్పష్టమవ్వలేదు.నైరుతి నగరమైన బైడోవాలో సోమాలి ప్రభుత్వ బలగాలు మరియు మిలీషియాల మధ్య గంటల తరబడి జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం నలుగురు పౌరులు మరణించగా, 98 మంది గాయపడినట్లు మంగళవారం ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు.

Also Read:RAC..రైల్వే శాఖకు జరిమానా

సంక్షోభం మరియు కరువు కారణంగా స్థానభ్రంశం చెందిన అర మిలియన్ కంటే ఎక్కువ మంది నివసిస్తున్న ఈ నగర శివార్లలో, సోమవారం తెల్లవారుజామున మిలీషియా బృందాలు ప్రభుత్వ స్థావరాలపై దాడులు చేయడంతో హింస చెలరేగింది. కనీసం 30 మంది మిలీషియా ఫైటర్లు మరణించారని సోమాలి అధికారులు తెలిపారు, అయితే ప్రభుత్వ బలగాల మరణాల సంఖ్యను వెంటనే వెల్లడించలేదు.

- Advertisement -