రేవంత్‌కి విద్యార్థుల భవిష్యత్తుపై శ్రద్ధ లేదు!

1
- Advertisement -

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, వారిపై పోలీసుల వైఖరి పట్ల బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తెలంగాణ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాలిటెక్నిక్ చదివి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉన్నత స్థాయికి ఎదిగారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. అలాంటప్పుడు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ (ECET) పరీక్ష ద్వారా బీటెక్ చేరి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోకుండా, వారి ఉన్నత విద్యకు వెళ్లే మార్గాన్ని సులభతరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థి జాటోత్ రాజేష్‌పై జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఐ రఘుపతి రెడ్డి సదరు విద్యార్థి గొంతు పట్టుకుని దాడికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. విద్యార్థిపై దాడి చేసిన సీఐ రఘుపతి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డీజీపీని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థుల చదువు, వారి సంక్షేమంపై ఏ మాత్రం శ్రద్ధ లేదని, కేవలం నిధులు, డబ్బు ఎలా సంపాదించుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టారని ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -