‘బగీరా’ మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్

2
- Advertisement -

తన ముద్దుల పెంపుడు శునకం ‘బగీరా’ (బర్నీస్ మౌంటెన్ జాతికి చెందిన కుక్క) మరణంతో ప్రముఖ  నటుడు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా బగీరాతో తనకున్న నాలుగు సంవత్సరాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అత్యంత భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేశారు.

ఎన్టీఆర్ బగీరాతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక భావోద్వేగ నోట్ రాశారు. ఒక ఫోటోలో బగీరా జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటినట్లు చూపించారు. బగీరా, నువ్వు నా జీవితంలోకి ఒక నేస్తంగా వచ్చి, కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. అపరిమితమైన ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా ప్రతి రోజూ నింపేశావు. నువ్వు లేని లోటు చాలా పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది, కానీ నువ్వు పంచిన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని పేర్కొన్నారు.

అలాగే నన్ను ఎంచుకుని, నా పక్కన నడిచి, ఈ నాలుగు సంవత్సరాలను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. రన్ ఫ్రీ, మై లిటిల్ వన్… నిన్ను ఎంతో ప్రేమించాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

Also Read:పరకాల నాదే..కొండా షాకింగ్!

వర్క్ ఫ్రంట్ విషయానికొస్తే, ఎన్టీఆర్ చివరిగా హృతిక్ రోషన్, కియారా అద్వానీలతో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘వార్ 2’లో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2027 జూన్ 11న విడుదల కానుంది.

- Advertisement -