14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు!

1
- Advertisement -

దేశంలోని 28 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులలో సగానికి పైగా అంటే 14 మంది ముఖ్యమంత్రులపై తీవ్రమైన నేరారోపణలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించబడింది. ప్రజాప్రతినిధులపై (ఎంపీలు, ఎమ్మెల్యేలు) ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసే అంశంపై సుప్రీంకోర్టు నియమించిన అమిస్కస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా ఈ 96 పేజీల వివరాల నివేదికను సమర్పించారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదవిలో ఉన్న మరియు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాదాపు 4,192 క్రిమినల్ కేసులు విచారణ దశలో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,171 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 14 మంది ముఖ్యమంత్రుల జాబితాలో వివిధ రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు ఉన్నారు.

తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల శాతంలో పశ్చిమ బెంగాల్ (58%) అగ్రస్థానంలో ఉంది.ఆ తర్వాత కేరళ (57%), ఆంధ్రప్రదేశ్ (56%), తెలంగాణ (49%), జార్ఖండ్ (45%), ఒడిశా (45%), బిహార్ (42%), మహారాష్ట్ర (40%) వరుసగా ఉన్నాయి. మొత్తం 543 మంది లోక్‌సభ సభ్యుల్లో 170 మంది (31%) తీవ్రమైన నేరారోపణల కేసులను ఎదుర్కొంటున్నారు.

Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

మొత్తం 233 మంది సభ్యుల్లో 75 మందిపై (33%) క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 40 మందిపై 5 ఏళ్లు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులు ఉన్నాయి.ఈ విచారణల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రజాప్రతినిధుల కేసులను మాత్రమే విచారించేందుకు ప్రత్యేక కోర్టులను కేటాయించాలని, ఆయా హైకోర్టులు ప్రతినెల ఈ విచారణల పురోగతిని పర్యవేక్షించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అమిస్కస్ క్యూరీ సుప్రీంకోర్టును కోరారు.

- Advertisement -