బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలో ఏడుగురు మహిళలు మరణించగా, పలువురు గాయపడ్డారని సోమవారం అధికారులు తెలిపారు.శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో అశోక్‌ధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఉదయం ఒక విద్యుత్ తీగ తెగిపడటంతో ఆలయంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
లఖీసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) శైలేంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 6.30 నుండి 6.45 గంటల మధ్య రెండు రైళ్లు రావడంతో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగిపోయిందని చెప్పారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ, తీవ్రమైన రద్దీ కారణంగా ఒక వైపు ఉన్న బారికేడ్లు విరిగిపోయాయని, దాంతో కొందరు కింద పడిపోయారని ఆయన తెలిపారు. అయితే, అధికారులు వెంటనే స్పందించారని అన్నారు.
భక్తుల క్యూ లైన్ అశోక్‌ధామ్ హాల్ట్ వరకు వెళ్లింది. ఆ హాల్ట్‌లో రెండు రైళ్లు ఆగాయి. హఠాత్తుగా అక్కడ ఒక విద్యుత్ స్తంభం పడిపోయింది. ఆ స్తంభం పురుషుల క్యూ లైన్‌కు కుడి వైపున ఉంది. స్తంభం కూలిపోగానే, భక్తులపై లైవ్ వైర్ పడిపోయిందనే గాలివార్త (రూమర్) వ్యాపించింది కానీ అది కేవలం కేబుల్ వైర్ మాత్రమే అని ఆయన చెప్పారు.
దీనివల్ల ఎడమవైపు ఉన్న మహిళల క్యూ లైన్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దాంతో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు… ఉదయం 3 గంటల నుంచే పోలీసు యంత్రాంగం అక్కడ విధులు నిర్వహిస్తోంది. ఇది కేవలం 2 నిమిషాల వ్యవధిలో హఠాత్తుగా జరిగింది. మేము ప్రస్తుతం సదర్ ఆసుపత్రిలో ఉన్నాము. మరణించిన వారందరూ మహిళలే. మృతుల ఖచ్చితమైన వివరాలను తెలుసుకుంటున్నాము అని వెల్లడించారు.
పరిస్థితిని సమీక్షించడానికి ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, విచారణ అనంతరం ఘటనకు గల పూర్తి కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
Also Read:అక్టోబర్ 9న ‘కామ్రేడ్ కళ్యాణ్’
ఈ ఘటనపై ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అత్యంత విషాదకరం మరియు హృదయ విదారకం అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన ఎక్స్ (X)లో పేర్కొన్నారు.

