తనకు, తన భార్య డోనా గంగూలీకి చంపేస్తామని వస్తున్న బెదిరింపు లేఖలు మరియు కాల్స్‌పై BCCI మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నంబర్ కోల్‌కతాకు చెందినదేనని, కోల్‌కతా పోలీసులు దీనిపై తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు.
గత ఆరు నెలలుగా సౌరవ్ గంగూలీ ఆఫీస్‌కు వరుసగా బెదిరింపు లేఖలు వస్తున్నాయి. మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఇటీవల వచ్చిన రెండు లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని, వారి సన్నిహితులను అంతం చేస్తామని స్పష్టమైన బెదిరింపులు ఉండటంతో ఆయన మేనేజర్ దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్ పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న కోల్‌కతా పోలీసులు మరియు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (STF) కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించాయి. లేఖలు పంపిన కొరియర్ సర్వీస్ ఆనవాళ్లను, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియా ప్రాంతం నుంచి ఈ లేఖలు పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బెదిరింపు లేఖలు పంపిన నిందితుడికి సంబంధించిన ఒక మొబైల్ నంబర్‌ను పోలీసులు ట్రాక్ చేశారు.
మేము ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు ఈ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నాను. ఆ నంబర్ ఇక్కడి కోల్‌కతాకు చెందినదే. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. నాకు తగినంత భద్రత ఉంది అని దాదా స్పష్టం చేశారు.
Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ

