రేవంత్ గురించి ఉన్నదే మాట్లాడా!

4
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపడంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను డబ్బుల కోసమో లేదా స్వార్థం కోసమో పార్టీ మారలేదని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం అంతా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసమేనని తేల్చి చెప్పారు.

తనపై వస్తున్న ఫిరాయింపు ఆరోపణలపై పోచారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి స్వార్థం లేదు. నా వ్యాఖ్యల్లో కానీ నిర్ణయాల్లో కానీ ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఒకవేళ నా నిర్ణయం వెనుక ఒక్క రూపాయి స్వార్థం ఉన్నా లేదా రాజకీయ స్వార్థం ఉందని నిరూపిస్తే తక్షణమే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని సవాలు విసిరారు.

తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, డబ్బులకు లొంగిపోయే మనస్తత్వం తనది కాదని తేల్చిచెప్పారు. కేవలం బాన్సువాడ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే తపనతో, తన ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ— “రేవంత్ రెడ్డి గురించి నేను ఉన్నదే మాట్లాడాను, అందులో తప్పేముంది?” అని ప్రశ్నించారు.

ప్రాంతీయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం త్వరగా అందుతుందనే ఉద్దేశంతోనే సానుకూలంగా స్పందించానని అన్నారు.తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును, మౌలిక సదుపాయాలను అందించడానికి ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడనని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read:బర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు

- Advertisement -