ఈసీ అధికారులు చెప్పెవన్ని అబద్దాలే!

0
- Advertisement -

దేశంలో ఓటర్ల జాబితా సవరణల చుట్టూ జరుగుతున్న వివాదంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈసీ (ఎలక్షన్ కమిషన్) అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఓటు తొలగించలేదని, కేవలం వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిందని ఈసీ అధికారులు చేసిన ప్రకటనలను ఆయన పచ్చి అబద్ధాలుగా అభివర్ణించారు. ఈ వ్యవహారంలో తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని వివరాలతో ప్రెస్ మీట్ పెడతానని వెల్లడించారు.

నా ఓటు తొలగించారని నేను సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తర్వాత అధికారులు నాకు ఫోన్ చేశారు. పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి అని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని, పొరపాటు జరిగింది అని చెబుతూ మరో వీడియో పెట్టాలని అధికారులు తనను కోరినట్లు ఆయన ఆరోపించారు.

వివాదం పెద్దదవుతుండటంతో హడావిడిగా ఈసీ వెబ్‌సైట్‌లో తన స్టేటస్‌ను ‘షిఫ్టెడ్’ అని మార్చి ఆ సమాచారాన్ని గోదీ మీడియాకు పంపి తాను అబద్ధాలు చెప్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ తీరుపై ప్రకాష్ రాజ్ తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ దేశ పౌరులు తమ ప్రాథమిక హక్కైన ఓటు కోసం లైన్లో నిలబడి ‘మా ఓటు మాకు కావాలి’ అని అడుక్కునే పరిస్థితి రావడం అత్యంత విచారకరం అని వాపోయారు.

Also Read:హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు నివేదిక!

వ్యవస్థలో జరుగుతున్న లోపాలను బయటపెట్టడానికే తాను పోరాడుతున్నానని, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆడియో ఆధారాలు కాల్ రికార్డింగ్‌లతో త్వరలోనే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అధికారుల ముసుగు తీస్తానని ఆయన వెల్లడించారు.

- Advertisement -