TTD:శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

1
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీపద్మావతి అమ్మవారి భక్తులకు తీపి కబురు అందించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న శ్రావణ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుకకు సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో కలిపి మొత్తం 500 టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఆఫ్‌లైన్ టికెట్లను ఆగస్టు 20న ‘ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత’ ఆధారంగా జారీ చేయనున్నారు. ఒక్కో టికెట్‌పై దంపతులకు వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం జరగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. వ్రతం సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రేక్ దర్శనాలతో సహా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తిరుచానూరు దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఎంతో విశిష్టమైనదని అర్చకులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించే మహిళలకు ఐశ్వర్యం, సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు.

Also Read:హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు నివేదిక!