బీహార్ సీఎం వల్లే..బీజేపీ ఓటమి!

1
- Advertisement -

ఇటీవల దేశంలో సాగుతున్న ‘జెన్-జె’ (Gen Z) లేదా యువత నిరసనల ప్రభావం వల్ల బాంకీపూర్‌లో బీజేపీ ఓడిపోలేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలో అవినీతి మరియు నిరుద్యోగం వంటి సమస్యలపై జంతర్ మంతర్ మరియు జార్ఖండ్‌లలో యువత ఆగ్రహం వ్యక్తం చేయడం నిజమేనని అయితే బాంకీపూర్ ఫలితం స్థానిక రాజకీయాల ప్రభావం వల్ల వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అని పీకే ఆరోపించారు. ఎన్డీయే కూటమి ప్రజల్లో పెద్దగా ఆమోదం లేని వ్యక్తిని (సామ్రాట్ చౌదరి) ముందుకు తెచ్చిందని పేర్కొన్నారు. ఆయన గత రాజకీయ రికార్డు, విద్యా అర్హతలు, ఆర్‌జేడీ (RJD) నేపథ్యం కారణంగా ప్రజలు ఆయనను ఎన్డీయే ముఖ్య నేతగా లేదా సీఎంగా అంగీకరించలేకపోయారని చెప్పారు.

ఇన్నాళ్లూ బీహార్ ప్రజలు ఆర్‌జేడీకి భయపడి బీజేపీకి, బీజేపీకి భయపడి ఆర్‌జేడీకి ఓట్లు వేస్తూ వచ్చారని, అయితే ఈసారి బాంకీపూర్ ఓటర్లు జన్ సురాజ్ రూపంలో ఒక నిజమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.తాను బాంకీపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటానని ఆయన వెల్లడించారు.రేషన్ కార్డుదారులకు పూర్తి స్థాయిలో 5 కేజీల ఉచిత రేషన్ ధాన్యాలు దక్కేలా చూస్తానని, లంచాలు లేకుండా కార్డులు ఇప్పిస్తానని చెప్పారు.

యువతకు వారి చదువు, నైపుణ్యాలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఒక ఎమ్మెల్యేగా తాను ఈ హామీలను నెరవేర్చి చూపిస్తే, బీహార్‌లోని మిగిలిన 242 మంది ఎమ్మెల్యేలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఏ విధమైన పొత్తులు లేదా అవకాశవాద కూటములు లేకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తూ వ్యవస్థాగత మార్పును తేవడమే తన లక్ష్యమని పీకే తేల్చి చెప్పారు.

Also Read:హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు నివేదిక!

- Advertisement -