రూ.271 కోట్లకు పెంట్‌హౌస్..రికార్డు డీల్!

1
- Advertisement -

దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా నిలిచే సంచలన డీల్ హర్యానాలోని గురుగ్రామ్‌లో నమోదైంది. గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని అత్యంత విలాసవంతమైన ‘డీఎల్‌ఎఫ్ ది డాలియాస్’ (DLF The Dahlias) ప్రాజెక్ట్‌లో ఒక పెంట్‌హౌస్ ఏకంగా రూ. 271 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ అత్యంత విలాసవంతమైన భవనాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా కొనుగోలు చేసినట్లు సమాచారం. దేశంలో ఒక అపార్ట్‌మెంట్ లేదా పెంట్‌హౌస్ అత్యధిక ధరకు విక్రయమవ్వడం గురుగ్రామ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఈ పెంట్‌హౌస్ మొత్తం 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. ఈ డీల్ ప్రకారంగా చదరపు అడుగుకు సగటున రూ. 1.58 లక్షల చొప్పున విక్రయించారు.

2024లో ప్రారంభమైన ఈ ‘డీఎల్‌ఎఫ్ ది డాలియాస్’ ప్రాజెక్టులో మొత్తం 420 అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ గృహాలకు వస్తున్న విపరీతమైన ఆదరణ కారణంగా, ప్రాజెక్ట్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు దాదాపు 65 శాతానికి పైగా ఇళ్లను విక్రయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగానికి పెరిగిన డిమాండ్‌కు మరియు వ్యాపార దిగ్గజాల లైఫ్‌స్టైల్ ప్రాధాన్యతలకు ఈ రికార్డు స్థాయి డీల్ నిదర్శనంగా నిలుస్తోంది.

- Advertisement -