చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్ అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. నేతన్న బతికితేనే మన చేనేత బతుకుతుంది.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు చిద్రమవుతున్నాయి అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొంది.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను మరిచి, పథకాలను నిలిపివేసి నేతన్నల జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది.మగ్గాలు మూగబోతున్నాయి…వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.జాతికి బట్ట నేసే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలి. నేతన్నకు భరోసా కల్పించాలి. చేనేతకు పునర్వైభవం తీసుకురావాలి.నేతన్నను కాపాడుకుందాం…చేనేతను బతికించుకుందాం అన్నారు.
Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

