జయశంకర్ సార్..నిరాడంబరుడు!

2
- Advertisement -

జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావి అని, గొప్పవాడు అని చెప్పుకోలేదు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఉద్యమం సమయంలో కొందరు జయశంకర్ సార్ దగ్గరికి వచ్చి తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని అడిగారు అన్నారు.

అప్పుడు సార్ మేధావులు ఎక్కడున్నారు…మేధావుల సంఘం అంటున్నారు నేనెలా పెడతాను.. ఈ ప్రపంచంలో నేను మేధావిని అని ఎవరూ చెప్పుకోరు అని అన్నాడు.. మొన్న ఓ సన్నాసి తెలంగాణలో ఇద్దరే మేధావులు అని అన్నాడు.. అటువంటి సన్నాసులకు జయశంకర్ సార్ లాంటి గొప్పోళ్లు అర్థం అవ్వరు అన్నారు.

కేసీఆర్, జయశంకర్ గారి మధ్య ఉన్నది ఉద్యమ అనుబంధం అన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. జయశంకర్ గారిని కేసీఆర్ ఒక తండ్రిలాగా చూసేవారు.. ప్రతి సభలో ఆయనకు పాదాభివందనం చేసిన తర్వాతే సభ మొదలయ్యేది.. నాకు కారు కూడా వద్దని నిరాడంబరంగా జీవించిన వ్యక్తి జయశంకర్ అన్నారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

- Advertisement -