రామాయణ రిలీజ్ డేట్‌ఫిక్స్

1
- Advertisement -

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక కావ్య చిత్రం ‘రామాయణ’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దివాళికి విడుదల కావాల్సి ఉండగా, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ ఇంగ్లీష్ డబ్బింగ్ ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ వన్ 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

రామాయణ ఇంగ్లీష్ ట్రైలర్‌ను పంచుకుంటూ సోనీ పిక్చర్స్ X (గతంలో ట్విట్టర్) వేదికగా ఇలా రాసుకొచ్చింది. ఇంతకు ముందెన్నడూ చూడని ఒక అద్భుతమైన కావ్య ప్రయాణం. #Ramayana అధికారిక ట్రైలర్‌ను చూడండి, నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది అని మేకర్స్ వెల్లడించారు.

Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

- Advertisement -