ఎర్రసముద్రంలో భారత నౌకపై దాడి

2
- Advertisement -

ఎర్రసముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపై దాడి జరగడంతో అది నీట మునిగింది. ఈ ప్రమాదం నుండి నౌకలోని 13 మంది భారతీయ నావికులతో పాటు ఒక యెమెన్ పౌరుడిని తీర రక్షణ దళాలు (కోస్ట్ గార్డ్) సురక్షితంగా రక్షించాయి. ఎటువంటి కారణం లేకుండా జరిగిన ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

యెమెన్‌లోని హొడైడా రేవు పట్టణానికి సమీపంలో ‘MSV ఫైజ్ నూరే ఒలియా’ అనే భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై ప్రొజెక్టైల్ (క్షిపణి లేదా రాకెట్)తో దాడి జరిగింది. దాడి ధాటికి నౌక సముద్రంలో మునిగిపోగా, మొఖా ప్రాంత తీర రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి నౌకలోని 14 మంది సిబ్బందిని రక్షించారు.

ఈ దాడికి ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులే కారణమని యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ఆరోపించింది. యెమెన్ సముద్ర జలాల సమీపంలో మన వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ అనవసరమైన, హేయమైన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొన్నారు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్.

Also Read:అశ్విన్‌కు ‘సారీ’ చెప్పిన అర్ష్‌దీప్!

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్: ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -