నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

2
- Advertisement -

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈ నెల 9వ తేదీన వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న కేసీఆర్ … ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తమ సానుభూతిని తెలియజేయనున్నారు.

నల్లబెల్లి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుండి పార్టీలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంస్మరణ కార్యక్రమాల మొదటి రోజైన 9వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. రెండవ రోజైన 10వ తేదీన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు పాల్గొని సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకోనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ నాయకులు మరియు వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.

Also Read:అశ్విన్‌కు ‘సారీ’ చెప్పిన అర్ష్‌దీప్!

- Advertisement -