మెటా సంస్థ ఇండియా హెడ్‌పై కేసు నమోదు చేసిన ఘటనలో సిటీ సైబర్ క్రైమ్ డీసీపీపై వేటు పడింది. నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్‌లను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలంగాణ బీజేపీ నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
ఈ కేసులో మెటా హెడ్‌ను సైతం నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కొందరు చేసిన పోస్టులకు మెటా ఎలా బాధ్యత వహిస్తుందని జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేసింది ప్రభుత్వం.
అరవింద్ బాబును డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడంతో డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు అరవింద్ బాబు.
Also Read:వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎందుకు?

