తలసేమియా బాధితులందరికీ పింఛన్లు

0
- Advertisement -

తెలంగాణలోని తలసేమియా మరియు సికిల్‌సెల్ అనీమియా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బాధితులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) నుంచే అర్హులైన బాధితులందరికీ ఈ పింఛన్లను పంపిణీ చేసేలా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులను వెంటనే గుర్తించి, జాబితాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీరికి ఈ పింఛన్లు ఆర్థికంగా, నైతికంగా ఎంతో చేయూతనందిస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

పింఛన్ల పంపిణీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు.వితంతువులు, ఒంటరి మహిళలు, నేత మరియు గీత కార్మికులు ఈ వర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పింఛను పొందుతున్న దివ్యాంగులు దురదృష్టవశాత్తూ మరణిస్తే, వారి కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండేందుకు, వారి భార్యలకు వెంటనే ఆ పింఛను వర్తించేలా యంత్రాంగం వేగంగా స్పందించాలని ఆదేశించారు.

Also Read:దుల్కర్..’ఐ యామ్ గేమ్’

అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా అన్యాయం జరగకుండా, పారదర్శకంగా ఈ పింఛన్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -