కర్ణాటకలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. వచ్చే వారం ప్రారంభంలోనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే మంత్రి పదవులపై ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సీనియర్ నేతల మధ్య దాదాపు రెండు గంటల పాటు జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.
ఈ విస్తరణపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందిస్తూ, తుది జాబితాను కాంగ్రెస్ అధిష్టానమే ఖరారు చేస్తుందని వెల్లడించారు.మంత్రివర్గ విస్తరణ అనేది పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని తెలిపారు బసవరాజ్ రాయరెడ్డి.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణ తేదీని త్వరలోనే ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, రాష్ట్ర సీనియర్ నేతలు, కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపిన అనంతరమే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read:ఇంజినీర్లను అవమానిస్తారా?
జూన్ 3న డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రస్తుతం కర్ణాటక మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర సహా 14 మంది సభ్యులు ఉన్నారు. ఖాళీగా ఉన్న బెర్త్‌లను భర్తీ చేసేందుకు అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది.

