పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన ఒక ఫేస్‌బుక్ వీడియో సాంకేతిక లోపం వల్ల పొరపాటున తొలగించబడిందని.. ప్రస్తుతం దానిని పునరుద్ధరించామని మెటా తెలిపింది. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ వీడియో కొద్దిసేపు అందుబాటులో లేకపోవడాన్ని వినియోగదారులు గమనించిన అనంతరం మెటా ఈ ప్రకటన విడుదల చేసింది.
ఆ కంటెంట్ పొరపాటున తొలగించబడింది…ప్రస్తుతం దానిని పునరుద్ధరించాం అని మెటా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ మీడియా వేదిక, జూలై 28 తెల్లవారుజామున ఈ వీడియో యాక్సెస్‌ను కొద్దిసేపు నిలిపివేసి, ఆ తర్వాత మళ్లీ అందుబాటులోకి తెచ్చింది.
నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్షలో జరిగిన అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో విద్యార్థులు 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూలై 23న విడుదల చేసిన ఈ వీడియో ద్వారా ప్రధాని మోదీ తొలిసారిగా నేరుగా యువతను (Gen Z) ఉద్దేశించి మాట్లాడారు.ఈ వీడియోలో ప్రధాని విద్యార్థులకు హామీ ఇస్తూ… పరీక్షల పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దీనికోసం మరింత బలమైన చట్టపరమైన నిబంధనలను కేంద్ర మంత్రివర్గం ముందుకు తెస్తుందని చెప్పారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించాను” అని మోదీ పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ కేసులను విచారించేందుకు కఠినమైన శిక్షలు, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ముసాయిదా చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు క్యాబినెట్ చర్చిస్తుందని తెలిపారు.
Also Read:TTD:ఆగస్టులో విశేష పర్వదినాలు

