ఐఐటీ విద్యార్థికి రామన్న భరోసా

2
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఐఐటీ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసి  కళాశాల ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు రామన్న.

ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లలోని నేత కుటుంబానికి చెందిన కుమారుడు గడదాస్ అభినవ్‌కు కేటీఆర్ అండగా నిలిచారు.హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో అభినవ్, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతలతో కలిసి కేటీఆర్‌ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభినవ్‌ను శాలువాతో సత్కరించి, “గిఫ్ట్ ఏ స్మైల్” కింద ల్యాప్‌టాప్‌ను బహుకరించారు.

Also Read:వీడియో.. టీచర్ ‘సెల్ఫ్ అటెండెన్స్ బోర్డ్’!

అంతేకాకుండా కళాశాల ఫీజు సైతం తానే భరిస్తానని భరోసానిచ్చారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థిని ఆయన ఆశీర్వదించారు.తమ చదువుకు కొండంత అండగా నిలిచిన కేటీఆర్‌ కి విద్యార్థి అభినవ్, కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -