పేపర్ లీకేజీలు, ఇతర వైఫల్యాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తే లేదా సోమవారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో విద్యావ్యవస్థ జవాబుదారీతనంపై చర్చిస్తామని పార్లమెంట్ సభ్యులు (MPs) హామీ ఇస్తే తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమిస్తానని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సోమవారం తెలిపారు.
ఎ. విద్యావ్యవస్థలో ఇటీవల జరిగిన వైఫల్యాలు, పేపర్ లీకేజీలు మొదలైన వాటిపై ప్రభుత్వం బాధ్యత వహిస్తే లేదా
బి. నేను, ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) నాయకత్వం పార్లమెంట్ దరిదాపుల్లోకి చేరుకున్నప్పుడు, వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని మాకు హామీ ఇస్తే, లేదా
సి. నా ఆరోగ్యం క్షీణించడం లేదా ఇతర కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే, వివిధ పార్టీల ఎంపీలు, నాయకులు ఈ ఆసుపత్రికి వచ్చి పై హామీలను ఇస్తే…
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నన్ను అక్రమంగా నిర్బంధించి, నా సంచార స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని, కమ్యూనికేషన్ హక్కులను పరిమితం చేశారు అన్నారు వాంగ్‌చుక్.
వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా మాట్లాడుతూ..రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను కలిసి, విద్యావ్యవస్థ జవాబుదారీతనం అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇస్తే ఆయన నిరాహార దీక్షను విరమిస్తారని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాలలో విద్యావ్యవస్థ జవాబుదారీతనం, సంస్కరణలే ప్రధానాంశంగా ఉండేలా చూస్తామని రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సోనమ్‌ను కలిసి హామీ ఇస్తే ఆయన రేపు దీక్షను విరమిస్తారు. ఒకవేళ పార్లమెంట్ ద్వారా ఆ జవాబుదారీతనం లభించకపోతే, ఆయన తన దీక్షను కొనసాగిస్తారు. రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఆయన తన నిరాహార దీక్షను విరమించలేదు అని ఆమె పేర్కొన్నారు.
Also Read:ఉద్ధవ్‌కు భారీ షాక్..!
మరోవైపు, కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వెలుపల అధికారులు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నిరసన స్థలం పరిసరాల్లో పోలీసులు నిఘా ఉంచారు.

