దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత..నిరుద్యోగుల భారీ ఆందోళన

4
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత రోడ్డెక్కింది.

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ముఖ్యంగా 20 పోలీస్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు.

నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీని పర్యవేక్షిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

నిరుద్యోగుల ఆందోళనతో దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:ముద్రగడ మృతిపై కేఏ పాల్

- Advertisement -