ఎల్-నినోపై ‘కంటింజెన్సీ ప్లాన్’

3
- Advertisement -

ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనే తొలి వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేయనున్నారు.

భారత వాతావరణ శాఖ (IMD) అంచనాలను ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు సకాలంలో శాస్త్రీయ సూచనలు అందించేలా ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏమిటి, నీటి వినియోగాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి, పంటల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నట్లు వెల్లడించారు.

పంట నష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం, వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ఈ కంటింజెన్సీ ప్లాన్ ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, రైతులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, సాంకేతిక సలహాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read:ఒకే దేశం-ఒకే ఎన్నికలు..భిన్న వాదనలు?

- Advertisement -