ముద్రగడ పద్మనాభం మృతి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన పేరుతో వెలుగులోకి వచ్చిన లేఖల వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.
ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు మరణానంతరం కూడా ఆయన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం బాధాకరమని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
ముద్రగడ కుమార్తెకు సంబంధించిన వ్యవహారం, ఆమె పేరుతో ప్రచారంలోకి వస్తున్న లేఖలను స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైన విధానం కాదని అన్నారు.
ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గంపై కూడా కేఏ పాల్ వ్యాఖ్యానించారు. కాపు నాయకులు, కాపు సమాజంలో ఐక్యత లేకపోవడం వల్లే ఆ వర్గానికి చెందిన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:ఒకే దేశం-ఒకే ఎన్నికలు..భిన్న వాదనలు?

