ఇంగ్లండ్ టెస్టు టీం కోచ్‌గా ద్రావిడ్?

1
- Advertisement -

ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్ తప్పుకోవడంతో కొత్త కోచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

రాహుల్ ద్రావిడ్‌తో పాటు మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, పూర్తి సమయ కోచ్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి ద్రావిడ్‌కు ప్రస్తుతం లేదని సమాచారం. అయినప్పటికీ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బాధ్యతలు చేపడితే ఇంట్లో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండటంతో పాటు తనకు ఎంతో ఇష్టమైన టెస్టు క్రికెట్ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. అందువల్ల ఆయన ఆసక్తిని ఈసీబీ తెలుసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కోచ్‌గా తప్పుకున్న తర్వాత మెకల్లమ్ భావోద్వేగంతో స్పందించారు. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్‌గా పనిచేయడం తనకు గొప్ప గౌరవమని చెప్పారు. టెస్టు జట్టుకు కోచ్‌గా ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కలిసి సాధించిన విజయాలపై గర్వంగా ఉంది. ఈ బాధ్యతలో కొనసాగాలని అనుకున్నా, తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇకపై వైట్‌బాల్ జట్ల విజయాల కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను అని మెకల్లమ్ పేర్కొన్నారు.

Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!

- Advertisement -