IRCTC సరికొత్త ఆఫర్

2
- Advertisement -

IRCTC సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. దేశంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలను దర్శించుకుని, ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని మీరు ప్లాన్ చేస్తుంటే IRCTC ఓప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీని తీసుకొచ్చింది. నాలుగు జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్‌ ఆలయం మరియు స్టాచ్యూ ఆఫ్ యూనిటీలను కవర్ చేసేలా 9 రాత్రులు, 10 రోజుల ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ ప్యాకేజీని ప్రారంభించింది.

ఈ పర్యటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ తీర్థయాత్ర ప్యాకేజీలో కింది ప్రాంతాలను సందర్శించవచ్చు:

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం (మధ్యప్రదేశ్)

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం (మధ్యప్రదేశ్)

ద్వారకాధీశ్ ఆలయం (గుజరాత్)

బెట్ ద్వారక (గుజరాత్)

నాగేశ్వర్ జ్యోతిర్లింగం (గుజరాత్)

సిగ్నేచర్ బ్రిడ్జ్ (గుజరాత్)

సోమనాథ్ జ్యోతిర్లింగం (గుజరాత్)

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (గుజరాత్)

ఈ టూర్ షెడ్యూల్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని, వినోద పర్యాటకంతో ముడిపెడుతుంది. దీనివల్ల ప్రయాణికులు పశ్చిమ, మధ్య భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రదేశాలను అన్వేషించవచ్చు.ఈ తీర్థయాత్ర ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. ఇది మొత్తం 9 రాత్రులు మరియు 10 రోజుల పర్యటన. ప్రయాణికులు తమ బడ్జెట్‌ను బట్టి స్లీపర్ క్లాస్ (Sleeper Class), థర్డ్ ఏసీ (3rd AC), సెకండ్ ఏసీ (2nd AC) వసతులను ఎంచుకోవచ్చు.

Also Read:ఓ.! సుకుమారి..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!

ప్రతిరోజూ ఉదయం అల్పాహారం,శాఖాహార మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం,గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత AC మరియు Non-AC బస్సుల ద్వారా స్థానిక పర్యాటక ప్రాంతాల సందర్శన ఉండనుంది. భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీ ధరలు (ఒక్కొక్కరికి)..స్లీపర్ క్లాస్: రూ. 18,380,థర్డ్ ఏసీ (3rd AC): రూ. 29,570, సెకండ్ ఏసీ (2nd AC): రూ. 38,870గా నిర్ణయించారు. IRCTC టూరిజం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -