హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత దెబ్బతీసే ఉద్దేశంతో అమెరికా సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై దాడుల పరంపరను ప్రారంభించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. వీకెండ్‌లో హార్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో అది అంటుకుని తగలబడింది అలాగే ఒక సిబ్బంది కూడా అదృశ్యమయ్యారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమెరికా ఈ తాజా దాడులకు దిగింది.
ఈ దాడులపై సెంట్‌కామ్ క్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ… ఇరాన్ దళాలను జవాబుదీలుగా ఉంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్‌పై మరిన్ని దాడులను ప్రారంభించాయి అని సెంట్‌కామ్ తెలిపింది.
అమెరికా చేసిన తాజా దాడులను ఇరాన్ ప్రభుత్వ మీడియా సోమవారం తెల్లవారుజామున అంగీకరించింది. అయితే, జలసంధికి సమీపంలో ఉన్న ప్రాంతాలలో పౌర మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని నివేదించింది. సైనిక లక్ష్యాలపై ఏవైనా దాడులు జరిగాయా లేదా అనేది తక్షణమే స్పష్టం కాలేదు.అమెరికా సైనిక చర్య తర్వాత దక్షిణ ఇరాన్ నగరాలైన జాస్క్, బందర్ అబ్బాస్, సిరిక్‌లలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్‌లపై ఇరాన్ దాడులు చేసింది. జలసంధికి అవతలి వైపు ఉన్న ఒమన్ దేశం షిప్పింగ్ ట్రాఫిక్‌ను నిర్వహించడంలో తమతో సహకరించాలని టెహ్రాన్ (ఇరాన్) ఒత్తిడి తెస్తోంది.మరోవైపు, ఈ ప్రాంతంలో అమెరికా వరుసగా భారీ సైనిక దాడులు నిర్వహించిన తర్వాత… హార్ముజ్ జలసంధి వాణిజ్య రవాణా కోసం తెరిచే ఉందని, జలసంధి తమ నియంత్రణలో ఉందన్న ఇరాన్ వాదనలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు.
అమెరికా దాడులను ఖండించిన ఇరాన్
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి అమెరికా సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఇవి ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్‌ను “స్పష్టంగా ఉల్లంఘించడమే”నని పేర్కొంది. వాషింగ్టన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో… ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సదుపాయాలను ఉపయోగించుకోవడానికి అనుమతించే ఏ దేశమైనా ఇరాన్ రక్షణ దాడుల యొక్క చట్టబద్ధమైన లక్ష్యంగా మారవచ్చని హెచ్చరించింది. అలాగే అమెరికా చేస్తున్న ఇటువంటి దురాక్రమణ చర్యలకు ఐక్యరాజ్యసమితి వారిని జవాబుదీలుగా చేయాలని కోరింది.
Also Read:ఓ.! సుకుమారి..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
“ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి ఏ దేశ భూభాగాన్ని లేదా సదుపాయాలను ఉపయోగించినా, దానిని దురాక్రమణకు మూలంగా పరిగణిస్తాం. ఇరాన్ సాయుధ దళాల రక్షణ చర్యల కోసం వాటిని చట్టబద్ధమైన లక్ష్యంగా చూస్తాం” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇటీవల మస్కట్‌లో జరిగిన చర్చల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది, అవన్నీ “సంపూర్ణ అబద్ధం” అని కొట్టిపారేసింది.

