తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అగ్రిమెంట్ ఉంటే బయటపెట్టు అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అగ్రిమెంట్ బయట పెడితే నేను రాజీనామాకి సిద్ధం … అగ్రిమెంట్ లేకుంటే తప్పయిందని క్షమాపణలు చెప్పు అని డిమాండ్ చేశారు.
తుమ్మిడిహట్టి నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు… కాంగ్రెస్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయితే ఒక్కసారి కూడా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కూడా ఇస్తాలేడా.. లేదా డ్రామాలు ఆడుతున్నారా … మాకే ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అపాయింట్మెంట్ ఇచ్చాడు.. మీరు కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారా చెప్పాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రూ.2328 కోట్లు దోచుకున్నారు..మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మొబిలైజేషన్ సిస్టంని రద్దు చేశాం.. గత నాయకులు చేసిన దోపిడీతో EPC విధానాన్నే కేసీఆర్ రద్దు చేశాడు…మా ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న నేను, ఆ నాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఇవ్వమని కోరాను అన్నారు.
దానికి ఆయన మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అడిగితేనే అనుమతి ఇవ్వలేదు.. మీకు అనుమతి ఇవ్వం అని అన్నాడు. ఆ తర్వాత 6 నెలలకే అక్కడ ఎన్నికలై బీజేపీ ప్రభుత్వం వచ్చింది.. అందులోని నీటి పారుదల శాఖ మంత్రి దగ్గరికి కూడా వెళ్ళాను.ప.. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును కూడా జరుపుకోకుండా స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను, నీటి పారుదల శాఖ మంత్రిని కలిసి బతిమిలాడాడు అని గుర్తు చేశారు.
గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది…మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు…చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడు… ఈరోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది అన్నారు. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్కరోజులో 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు… సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయి, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడంలేదు అన్నారు. దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటర్లు అసలు ఆన్ చేయలేదు…మీ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి అన్నారు హరీష్ రావు.
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం

