రెవెన్యూ శాఖ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లె గ్రామానికి చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి.
ఈ పిటిషన్ విచారిస్తూ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు చేయకపోవడం, మ్యుటేషన్లు చేయకపోవడం, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని హైకోర్టు తెలిపింది.
Also Read:వీడియో..రిల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం
పాస్ పుస్తకాల కోసం 3 నెలలు, భూ సర్వే కోసం 6 నెలల సమయం పడుతుందా?…అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది ప్రజలు హైకోర్టుకు వస్తున్నారు. హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా? … ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ, కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

