టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ట్రాఫిక్ పై యువతలో చైతన్యం తీసుకు వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. హైదరాబాదులోని సత్యసాయి నిగమాగమం వద్ద ట్రాఫిక్ అవగాహన సదస్సుకు వీరు వచ్చారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ప్రజల్లో ట్రాఫిక్ పై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అంతేకాకుండా యువత రూల్స్ బ్రేక్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారని.. ఒక దేశాన్ని శానిటేషన్, ట్రాఫిక్ చూసి దేశ ప్రజల మనస్తత్వం చెప్పవచ్చు అన్నారు అల్లు అర్జున్.
ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. డ్రైంకన్ డ్రైవ్ చేయవద్దు అని విద్యార్థులకు చెప్పిన బన్నీ.. అప్పుడప్పుడు మందు తాగొచ్చు…కానీ మందు తాగి వాహనం నడపవద్దన్నారు. మన కారణాల తప్పు ముందు ఎవరివైన ప్రాణాలు పోతే అవి నిలబడవని, ఇలాంటివి చాదస్తం అనుకున్న సరే… అవతలివారి ప్రాణాలతో ఆడుకోవద్దు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉన్నా… ఇంకా మార్పు రావాలి అని సూచించారు అల్లు అర్జున్.
ఇక రాజమౌళి మాట్లాడుతూ.. యువత అంటేనే స్పీడుకి కేరాఫ్ అడ్రస్..అది అవసరమే కానీ… డ్రైవింగ్ విషయంలో మాత్రం వద్దు అని సూచించారు డైరెక్టర్ రాజమౌళి. డ్రైవ్ చేసెటప్పుడు సహనంతో ఉండాలి.. మనలోని అపరిచితుని మాట వినికూడదన్నారు. ముఖ్యంగా డ్రైంకన్ డ్రైవ్ చేయవద్దు. టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలే తప్పా..ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదన్న జక్కన్న..రోడ్లు, ట్రాఫిక్ రూల్స్ ని విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు.