Ram Temple:సిట్ రిపోర్టు..షాకింగ్!

1
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన దర్యాప్తు వేగవంతం కావడంతో…ఈ దొంగతనం ఒక పద్ధతి ప్రకారం జరిగిందని, ఇది ఒకే ఒక్కసారి జరిగిన ఘటన కాదని, ‘సుదీర్ఘ కాలం’ పాటు కొనసాగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో తేలింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఉన్నత స్థాయి సమావేశంలో జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ఆమోదించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

SIT తన ప్రాథమిక నివేదికలో లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన అధికారుల బలహీనమైన నిఘాను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని పేర్కొంది. కౌంటింగ్ హాల్ లోపల నగదు కదలికలపై తగిన తనిఖీలు లేకపోవడాన్ని నిందితులు పూర్తిగా వాడుకున్నారు.

SIT గత 45 రోజులకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా సిబ్బంది పర్యవేక్షణ మరియు భద్రతా తనిఖీలలో పదేపదే లోపాలు జరిగినట్లు గుర్తించింది. నిందితులు ఆలయ ప్రాంగణం నుండి బయటకు వెళ్లేముందు నగదును తమ బట్టల లోపల దాచుకుని తీసుకెళ్లేవారని ఆరోపణలు ఉన్నాయి.

దర్యాప్తునకు ముందే కొంతమంది ఉద్యోగుల నుండి సుమారు రూ. 78.94 లక్షలు రికవరీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది జూన్ 4న కౌంటింగ్ రూమ్‌కు అనుకుని ఉన్న బాత్రూమ్ నుండి అదనంగా మరో రూ. 2.25 లక్షలను రికవరీ చేశారు. అక్రమాల గురించి తెలిసిన వెంటనే, ట్రస్ట్ అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది,” అని నివేదిక తెలిపింది.

SIT ప్రాథమిక నివేదిక తర్వాత అంతకుముందే రాజీనామా ఆమోదించబడిన ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిశ్రా పర్యవేక్షణలో విరాళాల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన తప్పనిసరి నిబంధనలను పాటించలేదని నివేదికలో తేలింది. వాస్తవానికి, ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) అమలు కాకుండా ఆయన చూశారని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 20, 2024న విరాళాల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మిశ్రాకు అప్పగించగా, ఆయన తనకు నచ్చిన సిబ్బందిని నియమించుకున్నారని మరియు సుభాష్ శ్రీవాస్తవ అనే వ్యక్తిని కౌంటింగ్ సెంటర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారని SIT నివేదిక పేర్కొంది. మిశ్రాతో పాటు చంపత్ రాయ్ ముఖ్య అనుచరుడు రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ యాదవ్ ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతని సిఫార్సుపైనే మనీష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని కౌంటింగ్ రూమ్‌లో నియమించారు. ఎటువంటి లిఖితపూర్వక అనుమతి లేకుండానే టిన్నూ హుండీల తాళాలు/యాక్సెస్‌ను నిర్వహిస్తున్నాడని SIT నివేదిక తెలిపింది.

Also Read:7 వేల కోట్లు..9 వారాలకే రోడ్డు క్లోజ్!

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన SIT, 45 రోజుల్లో కనీసం 70 సార్లు దొంగతనం జరిగినట్లు గుర్తించింది. ఇది 2025 ఏప్రిల్ లేదా మే ప్రాంతంలో ప్రారంభమై, ఈ ఏడాది జూన్ 5 వరకు కొనసాగిందని భావిస్తున్నారు. ఈ కాలంలో ప్రతిరోజూ దొంగతనం జరిగిందని SIT ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

ట్రస్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను గుర్తించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూనే.. ట్రస్టీ కృష్ణ మోహన్‌ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించింది.ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జి ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది మరియు ట్రస్టీ సురేష్ హావరె సభ్యులుగా ఉంటారు.

- Advertisement -