‘నాగబంధం’..హౌస్‌ఫుల్‌ రన్!

1
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘నాగబంధం’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

థాంక్స్ మీట్‌లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మేమందరం కొత్తవాళ్లం కలిసి ఇంత భారీ బడ్జెట్‌తో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నానికి ఆడియన్స్ అందరూ కూడా థియేటర్‌కు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది ఆడియన్స్ అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ మీద కనిపిస్తుంటే చెప్పులు తీసి సినిమా చూస్తున్నారు. వాళ్ల కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. మేము విమర్శకులను ఎప్పుడూ గౌరవిస్తాం. కాకపోతే కొంతమంది విమర్శకులు సినిమా చూడొద్దని కామెంట్లు చేస్తున్నారు. దయచేసి అలాంటి కామెంట్లు చేయొద్దు. ఒక సినిమాను చూడాలా వద్దా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అనంత పద్మనాభ స్వామి సినిమాలో కనిపిస్తుంటే ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇంతకంటే ఎమోషన్ ఏముంటుంది? ‘హర హర మహాదేవ’ నినాదంతో థియేటర్ అంతా మారుమోగుతుంటే ఇంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది? మన సనాతన ధర్మం, మన చరిత్రను తెరపై చూపిస్తుంటే ప్రతి ఒక్కరూ థియేటర్‌లో ‘హర హర మహాదేవ’ అంటున్నారు. డైరెక్టర్ గారు చాలా గొప్ప విజన్ తో ఈ సినిమా తీశారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. బుక్ మై షోలో సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పట్టి వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతి భాషలో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. కొత్త నిర్మాతలు ఒక కథను నమ్మి ఇంత భారీ స్థాయిలో సినిమాను తీశారు. ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. పరమశివుడే మా వెనుక ఉండి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారని నమ్ముతున్నాం. మీ మనసును నమ్మండి. ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. క్లైమాక్స్‌లో నాగసాధువును చూస్తున్నప్పుడు ‘శివుడే వచ్చి కనిపించాడు’ అని ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చప్పట్లు కొడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వారం కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ సినిమాను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ అభినందనలు. రెండున్నర ఏళ్ల కష్టానికి ప్రేక్షకులు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా చూసిన అందరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. కంటెంట్ చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. థియేటర్‌లో ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అలాగే దేశవ్యాప్తంగా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా మొదటి చిత్రం. నేను విమర్శకులకు, రివ్యూ రైటర్లకు అందరికీ గౌరవం ఇస్తాను. అంతిమంగా ప్రేక్షకుల నిర్ణయమే తుది నిర్ణయం. ఆడియన్స్ రెస్పాన్స్ మేరకు ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ లెంగ్త్ ఎక్కువగా ఉందని భావించి దాన్ని తొలగించాం. అలాగే క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉందని ట్రిమ్ చేశాం. కానీ కొంతమంది సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ సినిమాకు రెండున్నర ఏళ్ల ప్రయాణం ఉంది. అందరి కష్టం ఇందులో ఉంది. ఇలాంటి సినిమాలను నమ్మి ముందుకొచ్చిన నిర్మాతలను, హీరోను మీరందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా థియేటర్‌లో సినిమా చూసి మీ జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అదే మాకు గొప్ప ఎనర్జీ ఇస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు. ఆఫ్ఘన్లు భారతదేశంపై దాడి చేశారు. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు నాగసాధువుల అనే వర్గాన్ని ఏర్పాటు చేసి మన దేవాలయాలను రక్షించారు. ఇది మన చరిత్ర. హిందువులను ఎంత దారుణంగా చంపారో, దేవాలయాలను ఎలా ధ్వంసం చేశారో పుస్తకాలలో ఆధారాలు ఉన్నాయి. వాటిలో పదిశాతం మాత్రమే నేను సినిమాలో చూపించాను. ఆ చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. మీరందరూ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

నిర్మాత నిషిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఈ సినిమాకు ఎంతో ప్రేమ, ప్రోత్సాహం అందించారు. ఈ దేశానికి మా వంతు ఎదెఐనా చేయాలని ఈ దేశంలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించాము. అలాగే మన పిల్లలకు మన చరిత్ర, మన సనాతన ధర్మం, పెద్దలు చేసిన త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. మన ఉద్దేశం మంచిదైతే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. ఈ సినిమాకు ప్రతి షోకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. థియేటర్లకు వెళ్లి చూశాం. అన్నీ హౌస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. సినిమా చూసిన అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయడానికి ప్రేక్షకులు మాకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. తొలి నిర్మాతగా నాకు ఇంత ఆదరణ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహంతో నాలాంటి మరింత మంది నిర్మాతలు వచ్చి ఇలాంటి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను.

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాగబంధం చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజూ రెస్పాన్స్ పెరుగుతోంది.వీక్ లో అద్భుతమైన రన్ కనిపించింది. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. త్వరలోనే మా నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించబోతున్నాం.’ ఈ వ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.

- Advertisement -