ఆకృతిని పృథ్వీ షా మోసం చేశాడా?

3
- Advertisement -

ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టినట్లు చెబుతున్న ఒక పోస్ట్.. కాబోయే భర్త పృథ్వీ షాతో ఆమె బంధంపై రూమర్లను రేకెత్తించింది. అయితే ఈ ఊహాగానాలపై ఈ జంట ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అయిన ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఆమె బ్రేకప్ రూమర్ల మధ్య చిక్కుకుంది. రిలేషన్‌షిప్‌లో నమ్మకద్రోహం గురించి ప్రస్తావించిన ఆ పోస్ట్…ఆమె కాబోయే భర్త, భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించినదేనని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ స్టోరీ కనిపించడం లేదు. ఆమె దానిని డిలీట్ చేసిందా లేదా ఇన్‌స్టాగ్రామ్‌ 24 గంటల సమయ పరిమితి ముగిసిపోయిందా అనేది స్పష్టంగా తెలియలేదు. ఆ పోస్ట్‌లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, చాలా మంది యూజర్లు దానిని పృథ్వీ షాకు ముడిపెడుతున్నారు.

వైరల్ అయిన ఆ స్టోరీలో.. నేను చాలాసార్లు మోసపోయాను, అయినా ఒక్క మాట కూడా అనలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన (నిశ్చితార్థం) తర్వాత కూడా ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నాను. ప్రతిదీ నిజమే, ప్రతి రూమర్ నిజమే. సోషల్ మీడియాలో అతని గురించి మీరు చూస్తున్నది నిజమే అని ఉంది.
ఈ వైరల్ స్క్రీన్‌షాట్‌పై గానీ తమ రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలపై గానీ ఆకృతి అగర్వాల్ లేదా పృథ్వీ షా ఇప్పటివరకు స్పందించలేదు.

గత మార్చిలో క్రికెటర్ పృథ్వీ షా నటి ఆకృతి అగర్వాల్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ పోస్ట్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోల కింద పృథ్వీ షా.. మైదానంలో సిక్సర్లు కొట్టడం నుండి జీవితంలో ఒక పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ ఆడటం వరకు.. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అని రాశారు.

ఆకృతి దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్లలో ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, డాన్స్ కంటెంట్‌ను ఆమె క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవలే ‘త్రిముఖ’ అనే తెలుగు సినిమాతో నటిగా అరంగేట్రం చేశారు.

Also Read:రెండో టీ20 ఓటమిపై శ్రేయాస్

పృథ్వీ షా ఒకప్పుడు భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడైన యువ ఆటగాడిగా గుర్తింపు పొందారు. ఆయన సారథ్యంలో 2018లో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాతే అదే ఏడాది తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లోనే ఆయన సెంచరీ సాధించారు. అయితే, ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోవడంతో ఆయన భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతూ, తిరిగి జట్టులోకి పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -