టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇటీవల ప్రకటించిన పౌరాణిక చిత్రం (తాత్కాలిక టైటిల్ ‘గాడ్ ఆఫ్ వార్’) పట్టాలెక్కక ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సుబ్రహ్మణ్యస్వామి (మురుగన్) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తక్షణమే నిలిపివేయాలంటూ తమిళనాడుకు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ అధినేత, దర్శకుడు సీమాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవలే ఈ సినిమా ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ఉత్తరాదిన జన్మించి, దేశ గుండెల్లో రూపాంతరం చెంది, దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు అనే ట్యాగ్‌లైన్‌ను జోడించింది. దీనిపైనే తమిళనాట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
సుబ్రహ్మణ్యస్వామిని ఉత్తరాది దైవంగా, ఉత్తర భారతంలో పుట్టినవాడిగా చూపించడంపై సీమాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) తమిళుల ఇష్ట దైవం, మా ముత్తాత. ఆయన చరిత్ర, సంస్కృతి పూర్తిగా తమిళ గడ్డతోనే ముడిపడి ఉన్నాయి. కేవలం సినిమా వ్యాపార ప్రయోజనాల కోసం చరిత్రను తప్పుదోవ పట్టించి, తమిళుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేదే లేదు అని హెచ్చరించారు.
కళ పేరుతో తమిళ సంస్కృతిని తక్కువ చేసి చూపే ప్రయత్నాలను చిత్ర యూనిట్ తక్షణమే విరమించుకోవాలి. సినిమాను ఇక్కడితోనే ఆపేయాలి, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిపారు.
Also Read:రెండో టీ20 ఓటమిపై శ్రేయాస్

