అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం, చట్టాలు నాకు కల్పించిన అధికారాల ప్రకారం.. జూలై 4, 2026ను అమెరికా 250వ వార్షికోత్సవంగా ప్రకటిస్తున్నాను. మన ప్రియమైన రిపబ్లిక్ యొక్క అద్భుతమైన వారసత్వాన్ని, చరిత్రను మరియు సాధించిన విజయాలను గౌరవిస్తూ, అమెరికన్లందరూ ఈ రోజును సముచితమైన వేడుకలతో గర్వంగా జరుపుకోవాలని కోరుతున్నాను అని పిలుపునిచ్చారు.
అలాగే ట్రంప్ తాను అభివర్ణించిన నూతన అమెరికన్ స్వర్ణయుగం గురించిన తన విజన్‌ను వివరించారు. మనం అంతరిక్షంలోకి మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అమెరికన్లను మళ్లీ చంద్రుని ఉపరితలంపైకి శాశ్వతంగా పంపుతాం ,అంగారకుడి మన దేశ పతకాన్ని పాతడానికి ముందుకుసాగుతాం అని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం ఆవిష్కరణల్లో మరింత ముందడుగు వేస్తామని, భూమి కింద ఉన్న అపరిమితమైన ఇంధన వనరులను వెలికితీస్తాం …అమెరికా ప్రజల సంపదను, సమృద్ధిని విస్తరిస్తాం అని పేర్కొన్నారు.
ఈ రోజు అమెరికన్ ప్రజలుగా, ఫిలడెల్ఫియాలో మన వ్యవస్థాపకులు వెలిగించిన మరియు స్వాతంత్ర్య ప్రకటనలో పొందుపరిచిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. దేవుని సహాయంతో మన ప్రియమైన దేశాన్ని గతంలో కంటే మరింత బలంగా, గర్వంగా, సంపన్నంగా మరియు గొప్పగా మార్చడంలో మనం విజయం సాధిస్తాం అని తెలిపారు.
బైడెన్ ప్రభుత్వ హయాంలో ప్రాసిక్యూట్ చేయబడిన ఆరుగురు వ్యక్తులకు తాను క్షమాభిక్ష ప్రసాదించినట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. బైడెన్ పరిపాలన ద్వారా వేధింపులకు గురైన ఆరుగురు వ్యక్తులకు ఇప్పుడే క్షమాభిక్ష సంతకాలు చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజం. జో బైడెన్ నాలుగు సుదీర్ఘ సంవత్సరాల పాలనలో మన దేశం భరించవలసి వచ్చిన రాజకీయ కక్షసాధింపు మరియు మూర్ఖత్వంలో ఇది భాగం. నేను వారిని ఇప్పుడే విముక్తులను చేస్తున్నాను అని తెలిపారు ట్రంప్.అయితే ట్రంప్ ఆ ఆరుగురు వ్యక్తుల పేర్లను వెల్లడించలేదు.
Also Read:SIR పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్

