షబ్బీర్ అలీ అల్లుడిపై కేసు..

1
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అల్లుడు, హైదరాబాద్ మాజీ కమిషనర్ ఏకే ఖాన్ కొడుకుపై క్రిమినల్ కేసు నమోదు అయింది. పెట్టుబడుల పేరిట రూ.50 లక్షలు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ నిర్మాత.

హైదరాబాద్ – మణికొండ ప్రాంతంలో ఉంటూ “మహారాగ్ని” అనే సినిమా తెరకెక్కిస్తున్నారు వెంకట అనీష్ రెడ్డి అనే సినీ నిర్మాత.పెట్టుబడిదారుల కోసం ఎదురు చూస్తున్న అనీష్ రెడ్డికి, జూబ్లీహిల్స్ సన్ లైట్ కార్యాలయంలో పరిచయమై పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించారు షబ్బీర్ అలీ అల్లుడు మోసిన్ ఖాన్ మరియు తబ్రేజ్.

వారిని నమ్మి రూ.50 లక్షలు ఇచ్చారు అనీష్ రెడ్డి. ఎన్ని రోజులు గడుస్తున్నా సమాధానం లేకపోవడంతో, సన్ లైట్ కార్యాలయానికి వెళ్లి తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగగా, బౌన్సర్లతో అనీష్ రెడ్డిపై దాడి చేయించారు మోసిన్ ఖాన్. అనీష్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు మోసిన్ ఖాన్, తబ్రేజ్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read:EPFO సంచలన నిర్ణయం

- Advertisement -