ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి ఉండాల్సిందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. కొంచెం స్లోగా మరియు స్పాంజీగా ఉండే ఐర్లాండ్ వికెట్లపై సూర్యవంశీ అద్భుతంగా రాణించి ఉండేవాడని ఆయన విశ్లేషించారు. అతను ఆడి ఉండాల్సింది… ఐర్లాండ్‌లోనే ఆడించాల్సింది. అది స్లో మరియు స్పాంజీ ట్రాక్… అక్కడ అతను బంతిని పైకప్పుల (ఇళ్ల కప్పుల) పైకి బాదేవాడు. పైగా అక్కడ గ్రౌండ్ కూడా చిన్నది. అతనికి అక్కడే అవకాశం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లాండ్‌లో ఆడిస్తారో లేదో తెలీదు అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.
అతనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జట్టులో అవకాశం ఇవ్వాలి. ఐపీఎల్లో అతను అందరినీ చితక్కొట్టాడు, ఏ ఫాస్ట్ బౌలర్‌ను వదిలిపెట్టాడు? అలాంటి వాడిని మీరు బెంచ్‌పై కూర్చోబెడుతున్నారు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. యువతలో ఉండే ఉత్సాహం, ఎలాంటి భయం లేని తత్వం అతని సొంతం. అతను జట్టుకు మంచి ఓపెనింగ్స్ ఇవ్వగలడు, తద్వారా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మరింత రాణించవచ్చు. జట్టులో అతని కోసం ఒక స్థానాన్ని వెతకాలి. ఎంత త్వరగా అతనికి అవకాశం ఇస్తే అంత మంచిది అని శాస్త్రి అన్నారు.అయితే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడానికి మరికొంత కాలం బెంచ్‌పై వేచి ఉండక తప్పదని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ అంతకుముందు తెలిపారు.
Also Read:EPFO సంచలన నిర్ణయం
అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు, అందులో ఎలాంటి సందేహం లేదు,” అని సూర్యవంశీ అరంగేట్రానికి ఎంత దూరంలో ఉన్నాడనే ప్రశ్నకు డోస్చాట్ సమాధానమిచ్చారు. కానీ, మూడు నెలల క్రితం భారతదేశం ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన, ఐపీఎల్లో కూడా బాగా రాణించిన సంజూ శాంసన్‌ను పక్కన పెట్టాలని మేము అనలేము అన్నారు.

