దేశీయ ఇంధన వినియోగదారులకు ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ ‘నయారా ఎనర్జీ’ (Nayara Energy) తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో దానికి అనుగుణంగా బుధవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ బంకుల్లో పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 చొప్పున తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సడలడం మరియు అంతర్జాతీయ రవాణా మార్గాలు పునఃప్రారంభం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు దిగివచ్చాయి. ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ ఈ తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది. గత మార్చి నెలలో పెరిగిన ధరల భారాన్ని తగ్గించడమే కాకుండా గత రెండేళ్లలో ఒక చమురు సంస్థ దేశీయంగా ఇంధన ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అయితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) మాత్రం ప్రస్తుతానికి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. స్థానిక పన్నులు (VAT) ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఈ నూతన ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా ఉన్న 7,000 పైగా నయారా పెట్రోల్ బంకుల్లో తక్షణమే అమలులోకి వచ్చింది.
Also Read:పవన్‌తో పూజా హెగ్డే రొమాన్స్!

