ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణంలో మాజీ సివిల్ సప్లైస్ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘా తీవ్రం చేసింది. రూ.195 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చిన ఈ రవాణా స్కామ్‌లో సునీల్ కుమార్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
లిక్కర్ సిండికేట్‌కు చెందిన ప్రధాన సంస్థ ‘సిగ్మా లాజిస్టిక్స్’ నుంచి సునీల్ కుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా రూ.15 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మద్యం రవాణాకు సంబంధించిన సబ్-కాంట్రాక్టులను సునీల్ కుమార్ దక్కించుకుని, వాటిని స్థానిక నేతలకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కారుమూరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.నిందితుల వద్ద నుంచి రూ.9 లక్షల వరకు నగదును సీజ్ చేశారు.
నేరపూరిత సొమ్ముతో కొనుగోలు చేసినట్లు భావిస్తున్న ఒక విలాసవంతమైన లగ్జరీ కారు (రేంజ్ రోవర్), రెండు ఖరీదైన రోలెక్స్ (Rolex) వాచీలను ఈడీ జప్తు చేసింది.నిందితుల మొబైల్ ఫోన్లలో కరెన్సీ నోట్ల చిత్రాలను మార్పిడి చేసుకున్నట్లు ఉన్న హవాలా లావాదేవీల చాటింగ్‌ను కూడా అధికారులు గుర్తించారు.
Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ

