తండ్రి,కూతుళ్ల సెంటిమెంట్..ఇరుముడి!

2
- Advertisement -

రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇరుముడి గ్లింప్స్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కుతున్న ఇరుముడిపై బారీ అంచనాలు నెలకొన్నాయి.

రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన ఎమోషనల్ కంటెంట్, అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ గ్లింప్స్‌ లో తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న బంధాన్ని, భావోద్వేగాలను దర్శకుడు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.

వీడియో చివర్లో వచ్చే అయ్యప్ప స్వామి మాల సీక్వెన్స్ సీన్లు, దానికి తోడైన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు రోమాంచితమైన గూస్‌బంప్స్ తెప్పించాయి.

Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

- Advertisement -